పాతపట్నం కేంద్రంలో గల కె ఎస్ ఎం ప్లాజాలో జరుగుతున్న పాస్టర్ ఫ్యామిలీ ఫెలోషిప్ వేడుకల్లో పాస్టర్ల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం సాయంత్రం హాజరయ్యారు. క్రిస్మస్ సోదరి సోదరీమణులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వారి సమస్యలపై మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఆయనతో పాటుగా నియోజకవర్గ క్రిస్టియన్ పాస్టర్స్ తదితరులు ఉన్నారు.