విశాఖలో పాతపట్నం కు చెందిన ఒకరు చనిపోయిన ఘటన గురువారం రాత్రి వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం. పాతపట్నానికి చెందిన గోల్లంగి అరవింద్ (43) జీవీఎంసీ 6వ వార్డ్లో మధురవాడ కొమ్మాది ఎస్ ఎస్ వి డి అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆయన తన ప్లాట్లోనే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గతంలో ఆయన 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక వద్ద పీఏగా పనిచేశారు. పీఎంపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.