విద్యుత్ సరఫరాకు అంతరాయం
మెళియాపుట్టి మండలంలోని పెద్దపద్మాపురం, కోసమాల, వసుంధర, మర్రిపాడు, బందపల్లి తదితర గ్రామాలలో శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ ఈఈ. జి శంకర్రావు ఓ ప్రకటనలో తెలిపారు. మెలియాపుట్టి సబ్ స్టేషన్ 11 కేవీ తిడ్డిమి విద్యుత్ లైన్ నిర్వహణ పనులు చేపట్టడంతో సరఫరా నిలుపుదల చేస్తున్నామని ప్రజలు సహకరించాలని కోరారు.