ఈ సీజన్లో ఎరువుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా జరుగుతోందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సీజన్ లక్ష్యం 61, 262 టన్నులు కాగా లక్ష్యానికి మించి ఇప్పటి వరకూ 65, 007 టన్నులు సరఫరా చేశామన్నారు. గత నెల 28వ తేదీన జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.