శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న నేహురు యువ కేంద్రంలో ఈ నెల 23 వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో ఐ. ఐ. ఎఫ్. ఎల్ సమస్త ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ పాల్గొంటుందని ఆమె తెలిపారు. ఈ మేళాలో ఇంటర్, డిగ్రీ పూర్తైన 18 నుండి 35 సంవత్సరాలు కలిగిన స్త్రీ, పురుషులు అర్హులని తెలిపారు.