శ్రీకాకుళం రూరల్ మండలం పొన్నం గ్రామంలో వంశధార నదికి ఆనుకొని ఉన్న బోనగట్టు ఆక్రమణకు గురైన విషయం తెలిసిందే. నియోజవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ సహకారంతో మరల నిర్మించిన బోనగట్టు పున:నిర్మాణ పనులను జనసేన మండల అధ్యక్షుడు టి.కూర్మారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా శాశ్వత పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను కోరారు.