టెక్కలి మండల కేంద్రంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ (ఈసీఈ) 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వర్షప్రియకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు తగ్గింది. ఈ మేరకు కళాశాల యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 17 నిమిషాలలో పెన్సిల్ కొన మీద 26 అక్షరాలు చెక్కినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం లభించినట్లు తెలిపారు. యువతిని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.