జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ

59చూసినవారు
జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం నౌపడ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్యవివాహాలు మహిళలపై జరిగే నేరాలు, ఆన్ లైన్ సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, వంటి వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ప్రజలకు పోలీస్ స్టేషన్ లో ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటును మరింత తగ్గించేలా కృషి చేయాలని కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రతిరోజు పెట్రోలింగ్ లు నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్