టెక్కలి వీధుల్లో పేరుకుపోతున్న చెత్త

71చూసినవారు
టెక్కలి వీధుల్లో పేరుకుపోతున్న చెత్త
మండల కేంద్రం టెక్కలిలోని పలు వీధుల్లో చెత్తనిల్వలు ఎక్కడికక్కడ పేరుకుపోతుండడంతో దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. తెలుగు బ్రాహ్మణవీధిలో మురుగునీరు, చెత్తనిల్వలు నివాసగృహాల వద్ద అధిక మొత్తంలో పేరుకుపోతుండడంతో అపరిశుద్ధ్యం నెలకొందని స్థానికులు తెలిపారు. దుర్వాసనతో పాటు దోమలు అధికం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదివారం స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్