పాలేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రాభిషేకం

66చూసినవారు
పాలేశ్వర స్వామి ఆలయంలో మహా రుద్రాభిషేకం
మండల కేంద్రం సంతబొమ్మాళిలోని శ్రీ ఉమా పాలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం మహా రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితులు విశ్వనాధ శర్మ, కోటేశ్వర శర్మల ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణంలో భాగంగా పందిరిరాట కార్యక్రమం జరిగింది. మంగళవారం మహా చండీ హోమం స్వామి ఉమాపాలేశ్వర కళ్యాణం జరగనుంది. ఈ కళ్యాణ మహోత్సవానికి పరిసర గ్రామాల ప్రజలు హాజరై స్వామివారి కృప పొందాలని నిర్వాహకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్