రాష్ట్రంలో మంత్రుల పేషీల్లో అవినీతి పెరిగిపోతోందని టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈమేరకు ఆదివారం టెక్కలి లో ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు హోంమంత్రి అనిత పేషీల్లో అవినీతిపై మీడియాలో కథనాలు వస్తున్నాయని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని, ఎవరిపై చర్యలు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.