పంచధామ క్షేత్రంలో లక్ష శివలింగాల ప్రతిష్ఠ

50చూసినవారు
పంచధామ క్షేత్రంలో లక్ష శివలింగాల ప్రతిష్ఠ
కోటబొమ్మాళి మండలం చిన్న హరిశ్చంద్రపురంలో గల పంచధామ క్షేత్రంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజు శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష శివలింగాల ప్రతిష్ఠ మహా సంకల్పంలో భాగంగా శ్రావణమాసం, కార్తీక మాసాలలో కూడా శివలింగాల ప్రతిష్ఠ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు 63028 07802 ఫోన్ చేసి శివలింగాలు ప్రతిష్ట చేసేవారు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్