ఆముదాలవలస పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రారంభించారు. శనివారం ఆముదాలవలసలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం మెరుగైన విద్య మరియు భోజన సౌకర్యం అందరి విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యార్థులు అందరూ ఆరోగ్యంతో ఉన్నత చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించాలన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం చేస్తుందని తెలిపారు.