పెద్దపేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అంబులెన్స్

7517చూసినవారు
పెద్దపేట సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న అంబులెన్స్
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్ద పేట గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనంను అంబులెన్స్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రావన్నపేట గ్రామానికి లావేటి నవీన్, పాలవలస గ్రామానికి చెందిన మరొక వ్యక్తి ద్వి చక్ర వాహనంపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్