శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం

56చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్రోని కారణంగా శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వాయుగుండం ప్రభావంతో.. శ్రీకాకుళం జిల్లాలో 24 గంటల్లో 150 నుంచి 200 మీ మీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మండలంలో నది పరివాహక గ్రామాలైన కలివరం, తోగారాం, నిమ్మతర్లాడా, కొత్తవలస గ్రామాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. నదులు పొంగే ప్రమాదం ఉందని నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ రాంబాబు ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్