పొందూరు మేజర్ పంచాయతీ ఆవరణంలో సర్వేశ్వరపురం రోడ్డు పరిధిలోని సోషల్ క్లబ్ కబ్జాకు గురైందని ఆ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి పాల్పడిన వ్యక్తుల రిజిస్ట్రేషన్లను తక్షణం నిలుపుదల చేయాలని సర్పంచి రేగిడి లక్ష్మీ, సోషల్ క్లబ్ సభ్యులతో కలిసి ఇన్ఛార్జి రిజిస్ట్రార్ సంతోష్కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. హైకోర్టు తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.