రణస్థలం మండలం కమ్మసిగడాం శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయం రామతీర్థాలు వద్ద జరుగుతున్న బీటీ రోడ్డు నుంచి సీసీ రోడ్డు, కాలువ పనులను ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు సోమవారం పర్యవేక్షించారు. పనులు వేగవంతం చేయటంతో పాటు నాణ్యత పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులు వెలిచేటి రామకృష్ణ, మన్నె లక్ష్మీ ప్రసాద్, వెలిచేటి సురేశ్ కుమార్ ఉన్నారు.