రణస్థలం మండలం లంకపేట గ్రామంలో శుక్రవారం సాయంత్రం కిల్లారి సూరి కిష్టప్పడు(65), కిల్లారి రమణమ్మ (55) పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా దారిలో తేనె టీగలు దాడి చేశాయి. దింతో కుటుంబ సభ్యులు హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ కి తరలించగా రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు మృతి చెందారు. కాగా మృతులు వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు. శనివారం ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.