తెలంగాణలో ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి కార్మికులకు రూ.33 కోట్ల లాభాల వాటా మంజూరైంది. ఈ సొమ్ము ఈనెల 12న కార్మికుల ఖాతాల్లో జమ కానుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లాభాల్లో దసరా బోనస్‌గా కార్మికులకు 33 శాతం వాటా లాభాల బోనస్‌ను ప్రభుత్వం ఇది వరకే ప్రకటించి పంపిణీ చేసింది. ఆర్థిక సంవత్సరంలో మొత్తం నికర లాభాలు రూ.4,701 కోట్లు కాగా.. ఇందులో రూ.2,412 కోట్లలో 33 శాతం కింద రూ.796 కోట్లను కార్మికులకు పంచారు.