ఇచ్చాపురం పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను మున్సిపల్ కమిషనర్ నల్లి రమేష్ దృష్టికి 11వ వార్డు కౌన్సిలర్ ఆశి లీలారాణి తీసుకెళ్లారు. పట్టణంలోని బొబ్బిలి వీధి, రంగాల వీధి, గౌడ వీధిలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందులో భాగంగా వినతిపత్రం అందజేసి సమస్యను వివరించారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని లీలారాణి పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ అవగాహన సదస్సును కమిషనర్ నల్లి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.