నూతన సంవత్సర వేడుకల్లో ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబు సతిసమేతంగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన వేడుకలలో భాగంగా స్థానిక నాయకులు ఆయనకు ఘనంగా సత్కరించారు. అధికారులు, అభిమానులు, కార్య కర్తలు, ప్రజా ప్రతినిధులతో పాటు పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు.