వెలుగు కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం

57చూసినవారు
వెలుగు కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకం
నరసన్నపేట మండల మహిళా సమాఖ్య వద్ద ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వెలుగు ఏపీఎం హేమసుందర్ ఆధ్వర్యంలో స్టాల్ ఏర్పాటు చేసి అమ్మకాలు నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ అమ్మకాలలో కూరగాయలు, ఆకుకూరలు మహిళా సంఘ సభ్యులకు అమ్మకం చేపట్టారు. వీటి వలన పౌష్టికాహారం లభిస్తుందని, ఆరోగ్యంగా ఉంటారని, అంతేకాకుండా రసాయనిక కూరగాయల కంటే ప్రకృతి కూరగాయలు ఎంతో రుచికరమని ప్రకృతి వ్యవసాయ ఐసిఆర్పి కమలమ్మ వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్