పాలకొండ కోట దుర్గ ఆలయంలో బుధవారం గోపూజ నిర్వహించారు. భోగి, సంక్రాంతి, తర్వాత వచ్చే కనుమ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టారు. భారతీయ హైందవ సనాతన సంస్కృతి, సంప్రదాయాల్లో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందని, సమస్త లోకంలో 33 కోట్ల దేవతలకు అధిష్ఠాన దేవత గోమాత అని కోట దుర్గ అమ్మవారి ప్రధానార్చకులు దార్లపూడి లక్ష్మీ ప్రసాద్ శర్మ అన్నారు. ఇందులో పలువురు భక్తులు పాల్గొన్నారు.