రోడ్డుపై అడ్డంగా పడిన మహావృక్షం.. స్తంభించిన రాకపోకలు

4589చూసినవారు
రోడ్డుపై అడ్డంగా పడిన మహావృక్షం.. స్తంభించిన రాకపోకలు
శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బత్తిలి - ఆలికం ప్రధాన రహదారి లో భారీ వృక్షం కుప్పకూలి పోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. భామిని గ్రామం వద్ద తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్నటివంటి భారీ మర్రివృక్షం బుధవారం సాయంకాలం రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం వచ్చిన సహాయక సిబ్బంది రోడ్డుపై పడిఉన్న చెట్టు కొమ్మలను తొలిగించే పనులను ప్రారంభించారు. రోడ్డు పై అడ్డంగా పడిన ఈ మహావృక్షాన్ని తొలగించడానికి ఎంత టైం తీసుకుంటుందో, రోడ్డు క్లియరెన్స్ ఎప్పుడు జరుగుతుందో అని స్థానికులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్