పలాస: రైళ్లలో దొంగతనాలు చేస్తున్న చైన్ స్నాచర్ అరెస్టు

57చూసినవారు
ఇటీవల రైళ్లలో చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న వ్యక్తిని జీఆర్పీ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు పలాస జీఆర్పీ స్టేషన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రవికుమార్ మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆ వ్యక్తిని విశాఖ కోర్టుకు తరలిస్తున్నామన్నారు. నిందితుడు నరసన్నపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడని చెప్పారు.

సంబంధిత పోస్ట్