పలాస: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం

59చూసినవారు
పలాస: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. ఆదివారం పలాస నియోజకవర్గం మందస మండలంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా పలు రహదారుల నిర్మాణానికి గాను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. మందసలో ఏడు రహదారుల నిర్మాణానికి గాను రూ. 66లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ పనులను సంక్రాంతికి నాటికి పూర్తి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్