వజ్రపు కొత్తూరు సముద్ర తీరంలో ఈనెల 17న జంగం తరుణ్ (16) ఇంటర్ విద్యార్థి సముద్రంలో స్నానానికి దిగి గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు నాలుగు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టగా.. ఎట్టకేలకు సోమవారం కొత్తపేట తీరానికి తరుణ్ మృతదేహం కొట్టుకొచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.