వజ్రపుకొత్తూరు మండలం చిన్నబైపల్లిలో ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. తామాడ శాంతమ్మ (55) అనే మహిళ మృతదేహాన్ని జీడితోటలో గ్రామస్థులు గుర్తించారు. మెడకు ఉరితాడు ఉండగా.. మృతదేహం కిందపడి ఉండడంతో గ్రామస్థులు అనుమానం వక్తం చేస్తున్నారు. స్థానిక ఎస్సై నిహార్ అనుమానాస్పద మృతిగా మంగళవారం కేసు నమోదు చేశారు. శాంతమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందగా, ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు.