కొత్తూరు: దళితులు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన

63చూసినవారు
కొత్తూరు: దళితులు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన
పారాపురం గ్రామంలో దళితులు స్మశాన వాటికకు రహదారి సమస్య పరిష్కారం చేయాలని వ్య. కా. సం జిల్లా అద్యక్షుడు సిర్ల ప్రసాద్ దళిత నేత కె. సింహచలం శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దళితుల దహనసంస్కారాలు కోసం స్మశాన వాటికకు తీసుకువెళ్ళటానికి రహదారి లేదన్నారు. తక్షణమే ప్రజాప్రతినిధుల స్పందించి తమ సమస్యను పరిష్కారం చేయాలని దళితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్