కొత్తూరు మండల కేంద్రంలో ఎట్టకేలకు ఎండ ఎక్కడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.ఫెంగల్ తుఫాన్ వల్ల గత నాలుగు రోజులుగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వాతావరణ శాఖ శ్రీకాకుళం జిల్లాకు తుఫాను ప్రభావం లేదని చెప్పడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఎండ ఎక్కడంతో పసప, కుంటి భద్ర, మాతల, బమ్మిడి గ్రామాల రైతులు ధాన్యాన్ని కల్లాల్లో ఎండబెట్టి మిల్లులకు పంపడానికి సిద్ధం చేస్తున్నారు.