కొత్తూరు మండలం గూనభద్ర ఆర్ఆర్ కాలనీ పంచాయతీలో గురువారం పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ పెద్దకోట సాదుబాబు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను పిచ్చి మొక్కలను తొలగించామన్నారు. గ్రామ ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎవరి ఇంటి ముందు వారు పరిశుభ్రత పాటించాలని కోరారు. ఆయనతో పాటు సచివాలయం సిబ్బంది, గ్రామ పెద్దలు ఉన్నారు.