ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో మావోయిస్టులు, BSF దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో బలగాలు.. కోయలిబెడ పరిధి కుర్‌కుంజ్ అటవీప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఘటనాస్థలంలో 12 బోర్ తుపాకులు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.