తెలుగుదేశం పార్టీ అందించునున్న బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పథకాలపై గ్రామాలలో ప్రతి ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం చేయాలని మాజీ ఎంపీపీ కిమిడి రామకృష్ణ నాయుడు టిడిపి శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. మంగళవారం రేగిడి స్వగ్రామంలో వంగర, సంతకవిటి, రేగిడి ఆమదాలవలస మండలాల టిడిపి పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు.రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.