తప్పుడు సర్వే హద్ధుల నివేదికలు ఇచ్చి దళితులపై దాడులకు కారకులైన మండల సర్వేయర్, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. శనివారం కోటబొమ్మాళి తహశీల్దార్ కార్యాలయం ఎదుట తులసిపేట దళితులు నిరవధిక నిరసన దీక్ష కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షులు అనపాన షణ్ముఖ రావు, దళిత నేతలు పాల పోలారావు, చిట్టి సింహాచలం పాల్గొన్నారు.