శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఆయనకు అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.