టెక్కలిలో బైక్ చోరీ

64చూసినవారు
టెక్కలిలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల టెక్కలిలో ఒక జ్యువెలరీ షాపులో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి బంగారం గొలుసులు అపహరించుకుపోయారు. కాగా తాజాగా ఈ నెల 17వ తేదీ అర్ధరాత్రి స్థానిక శ్రీనివాస్ నగర్లో ఇంటి ముందు ఉన్న ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీటీవీలో నమోదు అయ్యాయి. దీనిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్