కోటబొమ్మాలి కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి బి. ఎం. ఆర్. ప్రసన్నలత నేతృత్వంలో మంగళవారం ఉదయం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఈ ఏడాది మార్చి నెల 8వ తేదీ రెండవ శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు చెప్పారు. లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేయాలని సూచించారు.