జనవరి 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఏబీవీపీ ఎస్ఎఫ్డీ జిల్లా కన్వీనర్ మదన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు చేతుల మీదగా గోడ పత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఎస్ ఎఫ్ డి జిల్లా కన్వీనర్ సిగిలిపల్లి మదన్ కుమార్, టౌన్ కన్వీనర్ సంతోష్, ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.