కాకినాడ తీరంలో 55 రోజులపాటు నిలిచిపోయిన స్టెల్లా నౌక ఎట్టకేలకు తన గమ్యస్థానానికి బయలుదేరింది. స్టెల్లా నౌక బయలు దేరడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆదివారం అర్థరాత్రి అధికారులు పచ్చజెండా ఊపారు. నవంబర్ 11న హల్దీయా నుంచి కాకినాడ తీరానికి వచ్చిన నౌకలో రేషన్ బియ్యం ఉండటంతో సీజ్ చేసిన విషయం తెలిసిందే.