చిరుత పులికి ఓ యువకుడు చుక్కలు చూపించాడు. ఈ ఘటన కర్ణాటకలోని రంగాపూర్‌లో జరిగింది. గ్రామంలో చిరుతపులి కనిపించడంతో గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. బోన్లు పెట్టి బంధించేందుకు ప్రయత్నించగా చిరుత తప్పించుకోవాలని చూసింది. ఆ సమయంలో గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు పులి తోకను పట్టుకుని బోనులో వేశాడు. అతడి సాహసాన్ని గ్రామస్థులు, అధికారులు మెచ్చుకున్నారు.