AP: ఇవాళ జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లను ఇస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. జూ పార్క్ నుంచి కపిల తీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకుండా తీర్మానం చేశారు. విదేశాల్లో ఆలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు, టీటీడీ ఆస్తులు కాపాడటానికి కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.