తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో జె.శ్యామల రావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం తరువాత అర్చకులు శేష వస్త్రం కప్పి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.