ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.