శనివారం సీఎం చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీలు, మంత్రులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశంలో జగన్ అంశంపై డిస్కషన్ నడిచింది. వినుకొండ హత్య నేపథ్యంలో ఢిల్లీలో జగన్ ధర్నా చేయనున్నారని ప్రస్తావన వచ్చింది. దీనిపై సీఎం చంద్రబాబు.. ‘ఢిల్లీలో జగన్ ఏం చేస్తాడనేది ఇప్పుడు ముఖ్యం కాదు. మనం చేయాలనేదే ముఖ్యం. జగన్‌ను లైట్ తీస్తోండి. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించండి.’ అని అన్నారు.