యూపీలో అగ్ని ప్రమాదం జరిగింది. బరేలీ జిల్లా థానాలోని ఫతేగంజ్ వెస్ట్ ప్రాంతంలో జాతీయ రహదారి 24పై అకస్మాత్తుగా వెళుతున్న కారులో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన కారు డ్రైవర్ వెంటనే బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, పేలుడు భయంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.