యూపీలోని ఘజియాబాద్‌లో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి ఓ నాలుగు అంతస్తుల ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒక మహిళ, ముగ్గురు పిల్లలు సహా మొత్తం నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి.. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.