హైదరాబాద్ మాధాపూర్‌లో మరోసారి గంజాయి కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే లక్ష్యంగా గంజాయి, హాష్ ఆయిల్‌ను విక్రయిస్తున్న ముఠాను శంషాబాద్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 830 గ్రాముల గంజాయి, 14 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే లక్ష్యంగా ఈ ముఠా గంజాయి విక్రయాలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.