AP: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పైచేయి సాధించింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాలకు గానూ.. 5,946 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 95 శాతం సంఘాలను కూటమి గెలుచుకుంది. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. సాగునీటి సంఘాల అధ్యక్షులు, డిస్ట్రిబ్యూటరీ కమిటీల చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందులలో మొత్తం 32 సంఘాలను టీడీపీ దక్కించుకుంది.