కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు శుక్రవారం విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలన్నారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు.