వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయడానికి కుట్ర జరుగుతుందని వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 'గతంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి జగన్పై కేసులు పెట్టాయి. జగన్ జైలుకు వెళ్లటానికి కాంగ్రెస్, టీడీపీ పెట్టిన అక్రమ కేసులే కారణం. టీడీపీ కుట్రలో షర్మిల పావుగా మారింది. షర్మిల ఆస్తుల కోసం పోరాడుతున్నారా? లేక జగన్ బెయిల్ రద్దు కోసం పోరాడుతున్నారా? అని వైవీ ప్రశ్నించారు.